24.7 C
Hyderabad
Monday, August 3, 2026

తెలంగాణ ట్రాన్స్ కో, టిజి డిస్కం అంతర్ జిల్లాల హాకీ టోర్నీ విజేత వరంగల్

Must read

📰 Generate e-Paper Clip

  • రన్నరప్ తో సరిపెట్టుకున్న నిజామాబాద్ జట్టు
  • ముగిసిన తెలంగాణ ట్రాన్స్ కో, టిజి డిస్కం అంతర్ జిల్లాల హాకీ టోర్నీ

 

నిజామాబాద్ సిటి, బతుకమ్మ : తెలంగాణ ట్రాన్స్కో , డిస్కమ్స్ ఇంటర్ సర్కిల్ హాకీ టోర్నమెంట్ (బ్రిడ్జి ఛాంపియన్ షిప్) విజేతగా వరంగల్ జట్టు గెలపొందింది. గత రెండు రోజులుగా జరిగిన తెలంగాణ రాష్ట్ర ట్రాన్స్కో డిస్కం అంతర్ జిల్లాల హాకీ టోర్నమెంట్ పైనల్ మ్యాచ్ మంగళవారం జరిగింది. ఈ మ్యాచ్ లో వరంగల్ జట్టు విజేతగా నిలిచింది. నిజామాబాద్ జట్టు రన్నరప్ గా నిలిచింది. ఈ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి ఓఎంసీ ఎస్ ఇ పివి రావు ముఖ్య అతిథిగా, ఎస్ ఈ ఆపరేషన్ నిజామాబాద్ రాపేల్లి రవింధర్ సభాధ్యక్షులుగా  విచ్చేసి బహుమతి ప్రదానోత్సవం చేశారు. వరంగల్ సర్కిల్ కు ప్రధమ స్థానంలో ట్రోఫీతో పాటు నగదు బహుమతి అందజేశారు.

Warangal wins Telangana Transco TG Discom Inter-District Hockey Tournament

నిజామాబాద్ జట్టుకు రెండో స్థానం ట్రోఫీతో పాటు నగదు బహుమతి అందజేశారు. తృతీయ స్థానంలో కరీంనగర్ జిల్లాకు ట్రోఫీతో పాటు నగదు బహుమతి అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ గెలుపు ఓటములను సమానంగా తీసుకోవాలి క్రీడా స్ఫూర్తిని చాటాలి అన్నారు.  ఓటమి గెలుపుకు పునాది గెలిచిన వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్కో డిఇ లు ఏ రమేష్, ఎం శ్రీనివాస్, వెంకట్ రమణ, విక్రమ్, ఎస్ ఏ ఓ శ్రీనివాస్, టోర్నమెంట్ ఆర్గనైజర్స్ ఎడి ఈ తోట రాజశేఖర్ ఏవో గంగారం సురేష్ కుమార్శంకర్ నాయక్ స్పోర్ట్స్ సెక్రటరీ ఏ గోపి, ఉత్తమ్, దినేష్ ,కె ఎస్ ఆర్ మూర్తి, సీనయ్య, సతీష్ ,సుభాన్, పఠాన్, సత్యనారాయణ, హాకీ టోర్నమెంట్ కు ఎంపైర్స్ గా స్వామి  శ్రీకాంత్ ఎన్ శ్రీకాంత్ హరీష్  గంగాధర్లు వ్యవహరించారు.

Warangal wins Telangana Transco TG Discom Inter-District Hockey Tournament

 

More articles

Latest article