25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

ఘనంగా వినాయక్ దామోదర్ వీర్ సావర్కర్ జన్మదిన వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

 

రుద్రూర్, బతుకమ్మ :

 

రుద్రూర్ మండల కేంద్రంలోని చత్రపతి శివాజీ మహారాజ్ చౌక్ వద్ద హిందూ సంఘాల నాయకుల ఆధ్వర్యంలో గురువారం రాత్రి వినాయక్ దామోదర్ వీర్ సావర్కర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అఖండ భారతదేశాన్ని తన ఇల్లుగా భావించి బ్రిటీష్ సామ్రాజ్యవాదుల గుండెల్లో గుబులు పుట్టించిన మరో జాతిపిత వినాయక్ దామోదర్ వీర్ సావర్కర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో హిందూ సంఘాల నాయకులు, గ్రామ పెద్దలు, యువకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article