వేల్పూర్, బతుకమ్మ : వేల్పూర్ మండల బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన బేల్దారి నవీన్ ఎంపీ అర్వింద్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. బాల్కొండ నియోజకవర్గ పార్టీ ఇన్ చార్జి డాక్టర్ మల్లికార్జున్ రెడ్డి ఆధ్వర్యంలో ఎంపీని కలిసిన నవీన్ ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ మండలంలోని అన్ని గ్రామాల్లో బీజేపీ బలోపేతానికి కృషి చేయాలని తనకు సూచించడంతోపాటు ఆశీర్వదించారని నవీన్ తెలిపారు.