నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఇంటర్ ఫలితాల్లో నిజామాబాద్ వెక్టార్ జూనియర్ కళాశాల విద్యార్థులు విజయఢంకా మోగించారు. ఎంపీసీ మొదటి సంవత్సరంలో గౌరవ్ శర్మ 466/470, మణిచంద్ర 466/470, బత్తుల వంశి 466/470, పోతులఆశ్రిత -466/470, మనస్విని 466/470 మార్కులు సాధించారు. ఎంపీసీ రెండో సంవత్సరంలో మామిడి నిశాంత్ రెడ్డి 991/1000, బీపీసీ IIyr లో మందలోజు శ్రీవర్షిని 989/1000 మార్కులతో రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించారని కళాశాల ఛైర్మెన్ మధు సూధన్ జోషి తెలిపారు. అత్యంత కఠినమైన జేఇఇ,నీట్ ఫలితాల్లో అద్భుతమైన ఫలితాలను సాధిస్తూ,ఇంటర్ ఫలితాల్లోనూ రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించడం గర్వకారణం అని అన్నారు. కళాశాల డైరెక్టర్లు సంగం సంతోష్, కందొల్ల గజానంద్, కొండవీటి కార్తిక్ ఈ సందర్భంగా విద్యార్థులను సన్మానించారు.
