25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

రైతులకు పాత పద్ధతి లోనే యూరియా సప్లై చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

యూరియా పంపిణీలో ఫోన్ యాప్ ద్వారా ఆన్‌లైన్ సిస్టమ్ ఆఫ్ చేసి పాత పద్ధతిలో రైతులకు యూరియా అందజేయాలని ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య అన్నారు. శనివారం జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయం లోని అధికారి సౌమ్య కి ఏఐకేఎంఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా భూమయ్య మాట్లాడుతూ జిల్లాలో యూరియా కొరత రైతులను తీవ్రంగా వేధిస్తుందని, యూరియా కొరకు రైతులు తిప్పలు పడుతున్నారని వారన్నారు. ప్రభుత్వం తీసుకువచ్చిన స్మార్ట్ ఫోన్, పెద్దఫోన్‌లో యాప్ ద్వారా యూరియాను ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకొమని చెబుతున్నా రైతులందరికి స్మార్ట ఫోన్లు ఎక్కడ ఉంటాయని వారు ప్రశ్నించారు. అందువల్ల ఉన్న ఫోన్‌లకు భూమి చూపించదని, ఒక వేళ జిల్లాలో ఎక్కడైన ఆన్‌లైన్ బుక్ చేసుకున్న రైతులు సొసైటీలు, పంపిణీ కేంద్రాల వద్ద వెళ్లేలోపు స్టాక్ చూపించిన బస్తాల స్థానంలో సున్నా చూపిస్తుందని, రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని వారన్నారు. అంత దూరం అవస్థ పడి వెల్లిన రైతులకు నిరాశ మిగులుతుందని తెలిసారు. స్థానికంగా ఉండే రైతుకు సమాచారం తెలిసిన వెంటనే బుక్ చేసుకోవడం తెలియక యూరియా దొరకడం లేదని పేర్కొన్నారు. యూరియా స్టాక్ చూపించిన కేంద్రంలో పట్టుమని 10 నిమిషాలు కూడా యూరియా బస్తాలు ఉండడంలేదని వాపోయారు. ఈ కొత్తపద్ధతి ఫోన్ యాప్ ఆన్‌లైన్ బుకింగ్ సిస్టమ్ వల్ల రైతులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నందున దానిని వెంటనే ఆపివేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పాతపద్ధతిలో రైతులకు పాస్‌బుక్ ద్వారా యూరియాను అందజేయాలని, కౌలు రైతులకు కూడా గ్రామ కార్యదర్శి ధృవీకరణ పత్రం ద్వారా అందజేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో దేశటి సాయిరెడ్డి, ప్రధాన కార్యదర్శి ఏ.చిన్నయ్య, వి.సాయిలు, శంకర్ దేవన్, గంగారాం, కే.గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

 

 

Urea should be supplied to farmers in the old way.

More articles

Latest article