24.1 C
Hyderabad
Monday, August 3, 2026

అయ్యప్ప ట్రస్ట్ అధ్వర్యంలో మహ అన్నదానంకు శ్రీకారం చూట్టిన అర్బన్ ఎమ్మెల్యే

Must read

📰 Generate e-Paper Clip

 నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: 

ఇందూర్ అయ్యప్ప ఆలయాన్ని దర్శించుకుంటే శబరి లోని  స్వామీ వారి ఆలయంను దర్శించుకున్న అనుభూతి భక్తులకు కల్గుతుంద ని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ అన్నారు. నగరంలోని అయ్యప్ప ఆలయంలో ఇందూర్ అయ్యప్ప సేవ సమితి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహాన్నదాన కార్యక్రమాని ముఖ్యఅతిథిగా అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ  పాల్గోని అయ్యప్ప స్వామికి ప్రతేక పూజలు నిర్వహించి, అయ్యప్ప స్వాములకు బిక్ష వడ్డీంచడం జరిగింది. ఈ సందర్బంగా ఎమ్మెల్యే  మాట్లాడుతు అయ్యప్ప మాల అంటేనే నిగ్రహానికి నిదర్శనం అని, కామ, క్రోధ, మదమత్సర్యాలను పంచెంద్రియలను అదుపులో పెట్టుకోవడం అన్నారు.ఇందూర్ లో దాదాపు 30 ఏళ్ల నుండి మాల దరిస్తున్న గుండమయ్య లాంటి గురు స్వాములు ఉన్నారని ఇందూర్ ఆలయ నిర్మాణానికి వారు ఎంతో కృషి చేసారన్నారు. జనవరి 20 వరకు మహాన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్న ఇందూర్ అయ్యప్ప సేవ సమితి ట్రస్ట్ ను ఎమ్మెల్యే  అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ భక్తవత్సలం , ట్రస్ట్ సభ్యులు సురేష్, ఆగమయ్యా, జగన్ మోహన్,తదితరులు పాల్గొన్నారు.

Urban MLA who initiated Maha Annadanam under Ayyappa Trust

More articles

Latest article