29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

రైల్వే స్టేషన్లో పేదలకు దుప్పట్లు పంపిణీ చేసిన అర్బన్ ఎమ్మెల్యే

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ నిజామాబాద్ సిటీ : భారతదేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీ  జన్మదినం సందర్బంగా 15 రోజుల పాటు జరిగే సేవా మహాజ్ఞాన కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ రైల్వే స్టేషన్ లో నిరుపేదలకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతు  ఆ మహనీయుని జన్మదినం సందర్బంగా భారతీయ జనతా పార్టీ సేవా మహాజ్ఞానం కార్యక్రమాలు దేశమంతట నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లాలో మొదటి రోజు జిల్లా పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరం, ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదానం, పండ్ల పంపిణీ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. సోమవారం నిజామాబాద్ రైల్వే స్టేషన్ లో నిరుపేదలకు దుప్పట్ల ను పంపిణీ చేశామన్నారు. భారతదేశాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్న ప్రధాని జన్మదినానికి జిల్లా వ్యాప్తంగా సేవకార్యక్రమాలు నిర్వహించి ఆయన కు బహుమతిగా ఇవ్వాలని పిలుపునిచ్చారు. నిరంతరం భారతమాతకు సేవలాందిస్తున్న ఆ మహనీయులు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో భగవంతుని ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

Urban MLA who distributed blankets to the poor at the railway station

More articles

Latest article