26.2 C
Hyderabad
Monday, August 3, 2026

ఆర్ఎన్ చిల్డ్రన్స్ హాస్పిటల్ ని ప్రారంభించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

జిల్లా కేంద్రంలోని ఖలీల్ వాడి లో ఆర్ఎన్ చిల్డ్రన్స్ హాస్పిటల్ ని ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ గుప్త సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎయిమ్స్ ఆస్పత్రిలో వైద్య శిక్షణ పొందిన పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ అబ్దుల్ సమద్ జిల్లా కేంద్రంలో ఆస్పత్రిని ప్రారంభించడం అభినందనీయమన్నా రు. ఆస్పత్రిలో చిన్నారులకు సంబంధించి అన్ని రకాల వైద్య పరికరాలను అందుబాటులో ఉంచుతూ నాణ్యమైన వైద్యాన్ని అందించాలని సూచించారు. ఈ సందర్భంగా డాక్టర్ అబ్దుల్ సమద్ మాట్లాడుతూ,  తమ ఆసుపత్రి ప్రారంభోత్సవం సందర్భంగా వారం రోజుల పాటు చిన్నారులకు ఉచిత కన్సల్టేషన్ అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, మేయర్ కూరగాయల ఉమారాణి, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాంభూపాల్, ఆస్పత్రి మేనేజర్ మమ్మద్ బిలాల్ తదితరులు పాల్గొన్నారు.

 

Urban MLA Dhanpal inaugurates RN Children's Hospital.

More articles

Latest article