నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ పట్టణంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవాం రాత్రి నిజామాబాద్ రైల్వే స్టేషన్ వద్ద గుర్తు తెలియని మృతదేహం లభ్యంమైనట్లు ఎస్ఎచ్ఓ రఘుపతి తెలిపారు. శవం ను పరిశీలించి చూడగా గుర్తు తెలియని వ్యక్తి ని ఎవరో అతని మెడ కు బట్ట, సుతిలి తో ఉరి బిగించి ఊపిరి ఆడకుండా చేసి చంపినట్టు పైకి కనపడుతోందన్నారు. మృతుడు బ్లాక్ కలర్ ఫుల్ షర్ట్, గ్రే కలర్ ప్యాంటు ధరించి ఉన్నాడన్నారు. మృతుని వద్ద ముస్లిo టోపీ ఉన్నది.మృతుని వయసు సుమారు 50 నుండి 55 వరకు ఉంటుందని తెలిపారు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా సమాచారం తెలిసినవారు దయచేసి వన్ టౌన్ పోలీస్ స్టేషన్, 8712659714 సంప్రదించాలని తెలిపారు.
