28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

Must read

📰 Generate e-Paper Clip

 

ఇందల్వాయి, బతుకమ్మ :

 

ఇందల్వాయి మండలంలోని నల్లవెల్లి గ్రామ శివారులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం కావడం స్థానికంగా కలకలం రేపింది. ఇందల్వాయి – సిర్నాపల్లి రైల్వే స్టేషన్ల మధ్య రైల్వే పరిధిలో మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే వారు రైల్వే పోలీసులకు సమాచారం అందించగా, ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమికంగా మృతుడు రైలు డోర్‌ వద్ద నిలబడి ఉండగా ప్రమాదవశాత్తు జారి పడి మృతి చెంది ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే మృతుడి వివరాలు, ఘటనకు సంబంధించిన పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై రైల్వే పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

More articles

Latest article