26.2 C
Hyderabad
Monday, August 3, 2026

దళిత నాయకుల ఎదుగుదలను చూసి ఓర్వలేకనే దాడులు

Must read

📰 Generate e-Paper Clip

  • మాలమహానాడు జాతీయ అధ్యక్షులు చెన్నయ్య

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : దళిత నాయకుడిపై హత్యయత్నం చేయటం చాలా బాధాకరమని, దళిత నాయకుల ఎదుగుదలను చూసి ఓర్వలేక భౌతిక దాడులకు పాల్పడుతున్నారని మాలమహానాడు జాతీయ అధ్యక్షులు చెన్నయ్య అన్నారు. మేయర్ భర్త దండు శేఖర్ పై సోమవారం జరిగిన హత్యాయత్నం లో సమగ్ర విచారణ జరిపి నిందితులను కఠినంగా  శిక్షించాలని ఇంచార్జీ కమిషనర్ సిందూశర్శకు మంగళవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నిందితులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని లేని పక్షములో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపు ఇవ్వాల్సివస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాలమహానాడు నాయకులు బూర్గుల వెంకటేశ్వర్లు, ఎడ్ల నాగరాజు, అనాంపల్లి ఎల్లం అలుక కిషన్, అంగరి ప్రదీప్,  నీలగిరి రాజు, నాంది వినయ్, స్వామి దాస్, సుశీల్ కుమార్, దేవిదాస్, బాలారాజు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article