. . . 30 మందికి జరిమానా
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :
మద్యం తాగి వాహానాలు నడిపినంటు వారిని 32 మందిని అరెస్ట్ చేసినట్టు ట్రాఫిక్ ఇన్స్ పెక్టర్ పి.ప్రసాద్ తెలిపారు. ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ ఆదేశానుసారం సోమవారం వారికి కౌన్సిలింగ్ నిర్వహించిన అనంతరం సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ హైమద్ మొయిద్దిన్ వద్ద హాజరుపరిచారు. వారిలో 30 మందికి రూ.3,00,000 జరిమనా విధించారని, కొయ్యడ శ్రీశైలం, చేగంటి వినోద్ కుమార్ అనే ఇద్దరు వ్యక్తులకు మాత్రం వారం రోజుల జైలు శిక్ష విధించినట్టు ఆయన పేర్కొన్నారు.
