కామారెడ్డి జిల్లాలో దేమికలాన్ లో డయోరియా కలకలం
కామారెడ్డి, బతుకమ్మ : వాంతులు, విరోచనాలతో ఇద్దరు మతి చెందారు. ఈఘటన కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం దేమికలాన్ లో చోటు చేసుకుంది. కలుషిత నీరు కారణమై ఉంటుందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామానికి చెందిన కొనింటి చిన్న భూమయ్య (60), మెట్టు స్వామి (32) తీవ్ర విరేచనాలతో మృతి చెందారని గ్రామస్తులు తెలిపారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గత మూడు రోజులుగా గ్రామంలో పదుల సంఖ్యలో మంది విరేచనాలు, వాంతులతో బాధపడుతున్నారని, పలువురి పరిస్థితి విషమించడంతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
