బతుకమ్మ, మోర్తాడ్: మోర్తాడ్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో సోమవారం రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందినట్లు స్థానికుల పేర్కొన్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సోయల్ (30), అతని స్నేహితుడు ఇద్దరు చక్రవాహనంపై ప్రయాణిస్తున్నారు. ద్వి చక్రవాహనం ఇనుప స్తంభానికి ఢీకొని సోయల్ అక్కడికక్కడే మృతి చెందగా, మెట్పల్లికి గ్రామానికి చెందిన అతని స్నేహితుడు కూడా మృతి చెందినట్లు స్థానికులు పేర్కొన్నారు. వివరాలు తెలియాల్సి ఉంది.

