ఉమ్మడి జిల్లాలో ఇద్దరు కానిస్టేబుళ్ళ సస్పెన్షన్

0 14,567

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లాలో ఇద్దరు కానిస్టేబుళ్ళు సస్పెన్షన్ కు గురయ్యారు. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పని చేస్తున్న రాకేష్ గౌడ్ ను సస్పెండ్ చేస్తూ కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 5న ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే రాకేష్ గౌడ్ విధులకు గైర్హాజరయ్యారు. మద్యం సేవించి వాహనం నడిపి తాడ్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రమాదానికి గురయ్యారు. పోలీసులు బ్రీత్ ఎన్ లైజర్ టెస్టు చేయగా మద్యం సేవించి ఉండడంతో అతన్ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నిజామాబాద్ జిల్లా మెండోరా పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ గంగాధర్ ను సస్పెండ్ చేస్తూ పోలీస్ కమిషనర్ సాయిచైతన్య ఉత్తర్వులు జారీ చేశారు. నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గంగాధర్ అధిక వడ్డీతో వ్యాపారం చేస్తున్నాడని కేసు నమోదైంది. విచారణ అనంతరం గంగాధర్ ను సస్పెండ్ చేస్తూ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.

Leave A Reply

Your email address will not be published.