28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

ట్రాన్స్ పోర్ట్ లారీ ఆపలేదని దాడి

Must read

📰 Generate e-Paper Clip

. ఆర్టీఏ చెక్ పోస్టులోని ప్రైవేట్ వ్యక్తుల జులుం

. డ్రైవర్ కు తీవ్రగాయాలు

భిక్కనూర్, బతుకమ్మ: నాందెడ్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ట్రాన్స్ పోర్ట్ లారీని చెక్ పోస్టు వద్ద ఆపలేదని ఆగ్రహంతో జంగంపల్లి వద్ద ఉన్న ఆర్టీఏ చెక్ పోస్టులోని ప్రైవేట్ వ్యక్తులు లారీ డ్రైవర్ పై దాడి చేశారు. కంటెయినర్ ను ఆపాలని చెక్ పోస్టులోని ప్రైవేట్ వ్యక్తులు సిగ్నల్స్ ఇవ్వగా డ్రైవర్ ఆపకుండా ముందుకు వెళ్లిపోయాడు. దీంతో ఆగ్రహానికి గురైన ప్రైవేట్ వ్యక్తులు కారులో లారీని వెంబడించి భిక్కనూరు టోల్ ప్లాజా వద్ద డ్రైవ్ పై దాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన డ్రైవర్ డయల్ 100కు కాల్ చేసి ఫిర్యాదు చేశాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు డ్రైవర్ ను స్టేషన్ కు తరలించగా, లారీని చెక్ పోస్టు సిబ్బందికి తీసుకెళ్లిపోవడం గమనార్హం.

More articles

Latest article