29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

ట్రాన్స్ కో ఎంప్లాయిస్ 1104 యూనియన్ జిల్లా కార్యవర్గం ఎన్నిక

Must read

📰 Generate e-Paper Clip

. . . రీజినల్ అధ్యక్ష, కార్యదర్శులుగా రాజేంధ్రప్రసాద్, గోపి కృష్ణ

నిజామాబాద్ సిటి, బతుకమ్మ :

తెలంగాణ  ఎలక్ట్రిసిటి ఎంప్లాయిస్ 1104 యూనియన్ ట్రాన్స్ కో జిల్లా కార్యవర్గాన్ని సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ట్రాన్స్ కో అధ్యక్షులు తులసీరాం, ప్రధాన కార్యదర్శి బాల కృష్ణ ఆధ్వర్యంలో నూతన జిల్లా  కార్యవర్గాన్ని జిల్లా  కేంద్రంలోని విద్యుత్ కార్మిక భవన్ లో ఎన్నుకున్నారు. రీజినల్ ప్రెసిడెంట్ గా రాజేంద్రప్రసాద్, రీజినల్ సెక్రటరిగా గోపి కృష్ణ  , వర్కింగ్  ప్రెసిడెంట్ గా భానుప్రకాష్, అడిషనల్  సెక్రటరిగా కృష్ణ కుమార్ గౌతమి, వైస్  ప్రెసిడెంట్లుగా స్వప్న, రాజు, మహిపాల్ లను, ఆర్గనైజింగ్ సెక్రటరిగా శ్రీధర్ రెడ్డి, ట్రెజరర్ గా నర్సింలును ఎన్నుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్ కో వర్కింగ్  ప్రెసిడెంట్  నాగరాజు, అదనపు కార్యదర్శి రామచంద్రం, ఎన్సీడీసీఎల్ డిస్కం ప్రెసిడెంట్ రఘునందన్,  జిల్లా, డివిజన్ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.

More articles

Latest article