పీహెచ్సీ నోడల్ అధికారులకు శిక్షణ

0 14,551

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జిల్లా వైద్య ఆరోగ్యశాఖలోని కుష్టు వ్యాధి నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో పీహెచ్సీ నోడల్ అధికారులకు కుష్టు వ్యాధిగ్రస్తుల డిజిటలీకరణ నికుష్టు పై జిల్లాస్థాయి శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖలోని డిఎంహెచ్ఓ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ బి రాజశ్రీ, ఎయిడ్స్ అండ్ లెప్రసీ రాష్ట్ర జాయింట్ డైరెక్టర్ డాక్టర్ డి. జాన్ బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ మాట్లాడుతూ జిల్లాలో లిప్రసిపై అవగాహన కార్యక్రమాల్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తూ , ఆశాలు ఏఎన్ఎంలు పర్యవేక్షణ అధికారులు వారి వారి గృహ సందర్శనలో నూతనంగా కుష్టు వ్యాధిగ్రస్తులని గుర్తించి వారికి చికిత్స అందించాలని కోరారు. అదేవిధంగా నూతనంగా గుర్తించిన కేసులన్నింటినీ నీకుష్టు 2.0 శిక్షణ ద్వారా పొందిన అవగాహనతో ప్రతి లెప్రసీ వ్యాధిగ్రస్తుల్ని డిజిటలీకరణ చేయాలని సూచించారు. ఈ శిక్షణ కార్యక్రమాన్ని లెఫ్రా సొసైటీ ద్వారా జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఇక్కడ శిక్షణ పొందిన వారు పీహెచ్సీ స్థాయి శిక్షణ కార్యక్రమాన్ని పీహెచ్సీ, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలకు అందించాలని ఈ సందర్భంగా తెలియజేశారు. జిల్లా , రాష్ట్రము మరియు దేశంలో 2027 సంవత్సరానికల్లా లెప్రసీ కేసులు నూతనంగా ఒకటి కూడా నమోదు కాకుండా కుష్టు రహిత భారత దేశంగా మార్చడమే మన అందరి లక్ష్యమని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

Training for PHC nodal officers

Leave A Reply

Your email address will not be published.