27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

పోలీస్​ స్టేషన్​లో విషాదం : గుండెపోటుతో ఎస్సై మృతి

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్,  బతుకమ్మ :  ఎల్బీ నగర్​ పోలీస్​ స్టేషన్​లో విషాదం చోటు చేసుకుంది. పోలీస్​ స్టేషన్​లో బుధవారం ఉదయం ఎస్సై సంజయ్​ సావంత్​ గుండెపోటుతో మృతి చెందాడు. వివరాలు ఇలా..  నాచారం లో నివాసం ఉండే సంజయ్​ సావంత్​ (58) ఎల్బీ నగర్​ పోలీస్​ స్టేషన్​లో ఎస్సైగా పని చేస్తున్నారు. బుధవారం ఉదయం పంచాయతీ ఎన్నికల విధులకు వెళ్లాల్సి  ఉండటంతో మంగళవారం రాత్రి పోలీస్ స్టేషన్​లోనే నిద్రించారు. బుధవారం  ఉదయం ఆయన ఒక్కసారిగా కుప్పకూలి పోయారు. కానిస్టేబుల్స్ వెంటనే ఎస్సైని సమీపంలోని కామినేని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

More articles

Latest article