కామారెడ్డి, బతుకమ్మ : నవంబర్ 2023 ఎన్నికల సమయంలో కామారెడ్డి అప్పటి పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పోటీ చేసిన సమయంలో ఆయన వెంట ఉన్నందుకు ఫోన్ ట్యాపింగ్ లో కామారెడ్డికి చెందిన గడ్డం చంద్ర శేఖర్ రెడ్డితో పాటు పీఏ.కర్ణాకర్ రెడ్డి, డ్రైవర్ అశోక్, మాజీ టౌన్ వైస్ ప్రెసిడెంట్ అరవింద్,హాజరు కావాలని జూబ్లీహిల్స్ ఏసీపీ కోరారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో బుధవారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ ఏసీపీ వద్ద సాక్షిగా టీపీసీసీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి తన వాంగ్మూలం ఇవ్వనున్నారు. ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన గడ్డం చంద్ర శేఖర్ రెడ్డి ఫోన్ ను అప్పటి ప్రభుత్వం ట్యాపింగ్ చేసింది. టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న గడ్డం చంద్ర శేఖర్ రెడ్డిని జూబ్లీహిల్స్ ఏసీపీ వద్ద సాక్షిగా పాల్గొనాలని జూబ్లీహిల్స్ ఏసీపీ కోరారు. పోలీసుల సూచన మేరకు ఫోన్ ట్యాపింగ్ కేసులో బుధవారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ ఏసీపీ వద్ద టీపీసీసీ జనరల్ సెక్రటరీ గడ్డం చంద్ర శేఖర్ రెడ్డి తన వాంగ్మూలం ఇవ్వనున్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో టీపీసీసీ జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డికి పిలుపు
