27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

నూతన ఆర్డీవో ని సన్మానించిన టీఎన్జీవో సంఘం సభ్యులు

Must read

📰 Generate e-Paper Clip

 

ఎల్లారెడ్డి, బతుకమ్మ :

 

నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎల్లారెడ్డి ఆర్‌డీఓ ని తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ (టీఎన్జీవో) సంఘం ఎల్లారెడ్డి యూనిట్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా టీఎన్జీవో ఎల్లారెడ్డి యూనిట్ అధ్యక్షుడు లచ్చిగారి మహిపాల్ ఆధ్వర్యంలో కార్యదర్శి వి. శరన్ కుమార్ సమక్షంలో గురువారం ఆర్‌డీఓ కి శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి సన్మానించారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమన్వయం కలిగి ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కలిసి పనిచేయాలని ఈ సందర్భంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో యూనిట్ కార్యదర్శి వి. శరన్ కుమార్, కోశాధికారి యు. రవీందర్, ఉపాధ్యక్షుడు–I జి. రాజా గౌడ్, ఉపాధ్యక్షుడు–II జె. శ్రీకాంత్, మహిళా ఉపాధ్యక్షురాలు జె. వసంత లక్ష్మి, మహిళా సంయుక్త కార్యదర్శి డి. స్వాతి, శంకరయ్య, ఇతర ఎల్లారెడ్డి టీఎన్జీవో యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

More articles

Latest article