27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

షబ్బీర్ అలీని కలిసిన టీఎన్జీఓ నాయకులు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా జిల్లా కేంద్రానికి విచ్చిన ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ను  అర్ అండ్ బి వసతిగృహం లో టీఎన్జీవోస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. అనంతరం ఉద్యోగుల సమస్యలపై చర్చించారు. సానుకూలంగా స్పందించి,తక్షణమే ఉన్నతాధికారులకు ఫోన్ చేసి సమస్యలను పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్, టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్, జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్, టిఎన్జీవో కేంద్ర కార్యదర్శి పోల శ్రీనివాస్, జిల్లా కోశాధికారి టి.దినేష్ బాబు, సంయుక్త కార్యదర్శి జాఫర్ హుస్సేన్ పాల్గొన్నారు.

More articles

Latest article