. . . రాష్ట్ర అధ్యక్షులుగా మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శిగా డా.ఎస్ఎం.హుస్సేని
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
టీఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా మారం జగదీశ్వర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా డా.ఎస్ఎం.హుస్సేని (ముజీబ్) మరోమారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు గచ్చిబౌలి టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ ఆవరణలో ఎన్నికల అధికారిగా సుగుణాకర్ రెడ్డి, సహాయ ఎన్నికల అధికారి సురేష్‌లు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయగా, టిఎన్జీవో రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల పోస్టులతో పాటు మొత్తం 19 పోస్టులకు సింగిల్ సెట్ నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో వారందరూ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ప్రకటించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ.. తమపై నమ్మకముంచి, మరోమారు రాష్ట్ర కమిటీకి నాయకత్వం వహించే అవకాశం కల్పించిన అన్ని జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులకు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక ముందు కూడా ఉద్యోగుల సమస్యల పరిష్కారమే ఏకైక ఎజెండాగా పని చేస్తామన్నారు. అనంతరం నూతనంగా రెండవసారి ఏకగ్రీవంగా ఎన్నికైన టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులను టీఎన్జీవో నిజామాబాద్ జిల్లా పక్షాన మర్యాదపూర్వకంగా కలిసి, శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్, టిఎన్జీవో జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్, టీఎన్జీవో రాష్ట్ర ఉపాధ్యక్షులు గైని గంగారం, రాష్ట్ర కార్యదర్శి పోల శ్రీనివాస్, జిల్లా సహాధ్యక్షులు పెద్దోళ్ల నాగరాజు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మచ్చకూరి సతీష్ కుమార్, ఆర్మూర్ యూనిట్ అధ్యక్షులు శశికాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
