27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

టీఎల్ఎం మేళా నిర్వహణ భేష్

Must read

📰 Generate e-Paper Clip

  • ఎంపిడీఓ గంగుల సంతోష్ కుమార్

 

భీంగల్, బతుకమ్మ : మండల ప్రైమరీ స్కూల్ ల హెడ్ మాస్టర్లు, టీచర్లు ఏర్పాటు చేసిన టీజ్ టీచింగ్ లేర్నింగ్ మెటీరియల్ (టీ ఎల్ ఎం) మేళా విద్యార్థులకు సులభ పద్దతిలో బోధించేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఎం పీ డీ ఓ గంగుల సంతోష్ కుమార్ అన్నారు. గురువారం ప్రైమరీ స్కూల్స్ స్టాఫ్ ఏర్పాటు చేసిన టీ ఎల్ ఎం మేళాను ఆయన సందర్శించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు బోధన చేసేందుకు వివిధ ఆకృతులతో తయారు చేసిన మేళాను చూసి ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారు. విద్యార్థులకు ఈ మేళా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. విద్యార్థులకు సులభ పద్ధతిలో అర్థమయ్యేలా రూపొందించిన మెటీరియల్స్ ను పరిశీలించి ఉత్తమ ప్రతిభ కనబరిచిన పాఠశాలకు ప్రశంసా పత్రాలను ఆయన అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ స్వామి,బాబాపూర్ ప్రధాన ఉపాధ్యాయులు శేఖర్,అన్ని పాఠశాలల హెచ్ఎంలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

TLM Mela is well organized

More articles

Latest article