బెంగళూరు, బతుకమ్మ : బెంగళూరులోని బన్నెర్ఘట్ట నేషనల్ జూ పార్కులో పర్యాటకుల వాహనంపైకి గురువారం మధ్యాహ్నం చిరుత పులి దూసుకొచ్చింది. దీంతో వారు భయాందోళనకు గురయ్యారు. వాహనంలో ఉన్న వాహిత్ బాసు అనే మహిళ పులిని గమనిస్తుండగా ఒక్కసారిగా ఆమెపైకి దూసుకొచ్చింది. ఈఘటనలో మహిళకు స్వల్ప గాయమైంది. మహిళను ఆస్పత్రికి తరలించినట్లు జూ పార్కు సిబ్బంది తెలిపారు. ఇందకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
