24 C
Hyderabad
Sunday, August 2, 2026

దొంగ పోలీస్ కాదు కాదు..

Must read

📰 Generate e-Paper Clip

  • పోలీస్ వర్సెస్ ఏసీబీ అధికారులు పరుగో పరుగు..

 

మెదక్, బతుకమ్మ : లంచం తీసుకున్న ఎస్ఐని వెంబడించి ఏసీబీ అదికారులు పట్టుకున్న ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. మెదక్ జిల్లా టేక్మాల్ ఎస్ఐ రాజేష్ ను ఏసీబీ అధికారులు వెంబడించి పట్టుకున్నారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మంగళవారం ఓ వ్యక్తి నుంచి రూ.30వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకునే ప్రయత్నం చేశారు. ఇదే క్రమంలో ఎస్ఐ రాజేష్ పారిపోతుండగా వెంబడించిన అధికారులు అతని పట్టుకున్నారు. ఎస్ఐ ఏసీబీకి చిక్కడంతో ప్రజలు టపాకాయలు కాల్చి ఆనందోత్సాహాలతో సంబరాలు జరిపారు.

More articles

Latest article