26.3 C
Hyderabad
Monday, August 3, 2026

నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో పంచాయితీ ఎన్నికలకు రంగం సిద్దం

Must read

📰 Generate e-Paper Clip

  • మూడు విడుతల్లో రెండు జిల్లాల్లో ఎన్నికలు
  • ఏర్పాటు చేసిన అధికార యంత్రాంగం

 

నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో పంచాయితీ ఎన్నికలకు అధికార యంత్రాంగం సిద్దమైంది. నిజామాబాద్ జిల్లాలోని 31 మండలాల్లోని 545 గ్రామ పంచాయితీలకు సంబంధించి 5022 వార్డు మెంబర్లకు ఎన్నికల కోసం 5053 పోలీంగ్  స్టేషన్లను ఏర్పాటు చేశారు. మొదటి విడతలో బోధన్ డివిజన్ లోని బోధన్ మండలం, చందూర్, కోటగిరి, మోస్రా, పోతంగల్, రెంజల్, రుద్రూర్, సాలూరా, వర్ని, ఎడపల్లి, నిజామాబాద్ డివిజన్ కు సంబంధించిన నవీపేట్ మండల పంచాయితీల ఎన్నికలు జరుగనున్నాయి. 11 మండలాల్లోని 184 పంచాయితీల్లో 1642 వార్డుల కోసం 1653 పోలీంగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. నిజామాబాద్ డివిజన్ లో రెండవ విడతలో ధర్పల్లి, డిచ్ పల్లి, ఇందల్వాయి, మాక్లూర్, మోపాల్, నిజామాబాద్  రూరల్, సిరికొండ, ఆర్మూర్ డివిజన్ లోని జక్రాన్ పల్లి మండలాలకు సంబంధించిన 196 పంచాయితీల ఎన్నికలతో పాటు 1760 వార్డుల కోసం 1760 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. మూడవ విడతలో ఆర్మూర్ డివిజన్ కు సంబంధించి ఆలూర్, ఆర్మూర్, బాల్కొండ, భీంగల్, డొంకేశ్వర్, కమ్మర్ పల్లి, మెండోరా, మోర్తాడ్, ముప్కాల్, నందిపేట్, వేల్పూర్, ఏర్గట్ల మండలాలకు సంబంధించి 165 జీపీలలో 1620 వార్డుల సభ్యుల ఎన్నికల కోసం 1640 పోలీంగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు.

కామారెడ్డి జిల్లాలో 25 మండలాల్లో 532 పంచాయితీలకు ఎన్నికలు జరుగనున్నాయి. మొదటి విడతలో బిక్కనూర్, బీబీపేట్, దోమకొండ, మాచారెడ్డి, పాల్వాంచ, రామారెడ్డి, సదాశివనగర్, తాడ్వాయి, రాజంపేట్ మండలాల్లో 167 పంచాయితీలకు అందులోని వార్డు సభ్యుల ఎన్నికలు నిర్వహించనున్నారు. రెండవ విడతలో లింగంపేట్, నాగిరెడ్డిపేట్, గాంధారి, ఎల్లారెడ్డి, మహ్మద్ నగర్, పిట్లం, నిజాంసాగర్ లోని 197 పంచాయితీలు వార్డు మెంబర్స్ ఎన్నికలు జరుగనున్నాయి. మూడవ విడతలో బాన్సువాడ, బిచ్కుంద, బీర్కూర్, డొంగ్లీ, జుక్కల్, మద్నూర్, నస్రుల్లాబాద్, పెద్దకొడప్ గల్ మండలాల్లోని 168 జీపీలు వార్డుల ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

More articles

Latest article