- నిజామాబాద్ ట్రాఫిక్ ఏసీపీ నారాయణ
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జర్నలిస్టులు చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలు అభినందనీయమని నిజామాబాద్ ట్రాఫిక్ ఏసీపీ నారాయణ అన్నారు. ప్రతి యేటా వేసవిలో ప్రజల దాహార్తి తీర్చేందుకు చలి వేంద్రాలు ఏర్పాటు చేయడం ఆదర్శనీయమన్నారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ వద్ద ఏర్పాటు చేసిన

చలివేంద్రాన్ని ఏసీపీ నారాయణ ప్రారంభించారు. జిల్లాలో ఎండలు మండుతున్నాయని వివిధ పనుల కోసం నగరానికి వచ్చే ప్రజలు మంచి నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేశారు. వేసవి దప్పిక తీర్చేందుకు జర్నలిస్టుల తరహాలో స్వచ్చంద సంస్థలు కూడా ముందుకు రావాలని పిలువునిచ్చారు. మైనర్ డ్రైవింగ్ పై నిరంతరం స్పెషల్ డ్రైవ్ యూ ఉంటాయని పేరెంట్స్ తమ పిల్లలకు వాహనాలు ఇవ్వవద్దని సూచించారు.మైనర్ లకు వాహనాలు ఇస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

