31.8 C
Hyderabad

అమరుల త్యాగాలు వెలకట్టలేనివి

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ : వర్గీకరణ కోసం అసువులు బాసిన మాదిగ అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని మండల ఎంఆర్ పిఎస్‌  నాయకులు అన్నారు. శనివారం రాత్రి రుద్రూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణంలో ఎంఆర్ పిఎస్‌ మండల కమిటీ ఆధ్వర్యంలో  మాదిగ అమర వీరులకు జోహార్లు అంటూ నినాదాలు చేస్తూ నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ బందెల సంజీవులు, మాజీ సర్పంచ్ ప్రసాద్, ఎంఆర్ పిఎస్ అధ్యక్షులు ఉషం సాయికుమార్, ఉపాధ్యక్షులు ఆర్. సాయిరాం, యాలపురం పోశెట్టి, గుజ్జుల సాయికుమార్, బుడ్డోళ్ళ నగేష్, గంగారం తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article