మోర్తాడ్, బతుకమ్మ :
రాజకీయాల్లో యువకుల పాత్ర కీలకమైందని మోర్తాడ్ మండల యువత అధ్యక్షుడు అడ్వల మనోజ్ అన్నారు. మండల కేంద్రంలో ఆదివారం 65వ యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన కాంగ్రెస్ జెండా ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో మోర్తాడ్ టౌన్ యూత్ ప్రెసిడెంట్ పుప్పాల రాజేష్, సుంకేట్ యూత్ ప్రెసిడెంట్ గాండ్ల ప్రవీణ్, దొన్కల్ యూత్ ప్రెసిడెంట్ బాస మల్లికార్జున్, ఏఎంసీ డైరెక్టర్ నవీద్, మండల కాంగ్రెస్ నాయకులు జిన్న అరుణ్, బొట్టు రవి, కంఠం ప్రదీప్, దుంపేట ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు.
