28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

అత్యాచారం చేసిన దుండగుడిని శిక్షించాలి

Must read

📰 Generate e-Paper Clip

  • ఆశా యూనియన్ డిమాండ్

 

రుద్రూర్, బతుకమ్మ : జగిత్యాల జిల్లాలో ఆశా వర్కర్ పై అత్యాచారం చేసిన దుండగుడిని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని రుద్రూర్ పీహెచ్ సీ ఆశా యూనియన్ అధ్యక్ష, కార్యదర్శి భూలక్ష్మి, వాణి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం రుద్రూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం 50 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మెరుగైన వైద్య చికిత్స అందించాలని కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఆశా యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ లతా, లక్ష్మి  తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article