24.1 C
Hyderabad
Saturday, August 1, 2026

నిజామాబాద్ జిల్లా ప్రజలకు మానవత్వం లేదు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా ప్రజలకు మానవత్వం లేదని సీపీ సాయి చైతన్య సంచలన వ్యాఖ్యలు చేశారు. కానిస్టేబుల్ ప్రమోద్ హత్య దురదృష్టకరమన్నారు.  శనివారం నిజామాబాద్ మెడికల్ కాలేజీ వద్ద సీపీ మీడియాతో మాట్లాడారు. నడిరోడ్డుపై ఘటన జరుగుతుంటే ప్రజలెవరు అడ్డుకోలేదని,   గాయపడ్డ పోలీసును షిఫ్ట్ చేసేందుకు ఎవరు ముందుకు రాలేదని విమర్శించారు.  హత్య జరుగుతుండగా కాపాడాల్సిన ప్రజలు మొబైల్ ఫోన్లలో వీడియోలు తీశారని,  అక్కడున్న వారికీ మానవత్వం లేదని, ఈవిషయం వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని వ్యాఖ్యనించారు.  హంతకుడు రియాజ్ కోసం 8 బృందాలు గాలిస్తున్నాయన్నారు.  సీసీఎస్ పోలీసుల వద్ద
ఆయుధాలు ఉన్నాయన్నారు.

More articles

Latest article