- నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్
నిజామాబాద్, బతుకమ్మ : నాలుగు దశాబ్దాలుగా రైతులు ఎదురు చూస్తున్న పసుపుబోర్డు కోరిక నెరవేరే తరుణం ఆసన్నమైందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి ఆదివారం జిల్లాకు రానున్న సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభ ఏర్పాట్లను ఆయన శనివారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ జిల్లాకు పసుపు బోర్డు కేంద్రీయ కార్యాలయం కేటాయించిన విషయం తెలిసిందేనని అన్నారు. ఈ పసుపు బోర్డు కేంద్రీయ కార్యాలయాన్ని కేంద్రం హోం శాఖ మంత్రి అమిత్ షా ఆదివారం ప్రారంభించనున్నారని తెలిపారు. ఈ పసుపు బోర్డు వల్ల ప్రయోజనాలు అనేకంగా ఉన్నాయన్నారు. పండించిన ప్రతి పసుపు కొమ్ము విత్తనాలు వేసే సమయానికే రైతు ఎవరికి అమ్ముతున్నాడు అనేది బోర్డు బాధ్యతని తెలిపారు. కోతలు కాగానే వాల్యూ ఎడిషన్, ప్రాసెసింగ్ యూనిట్, ప్యాకేజింగ్ యూనిట్లు, స్టోరేజీ ఫెసిలిటీలు పెంచుకోవడం బోర్డు బాధ్యతని తెలిపారు. ప్రతి పసుపు కొమ్ము అంతర్జాతీయ ఎక్స్ పోర్ట్ క్వాలిటీ చేసే విధంగా రైతులను తీర్చిదిద్దడం బోర్డు బాధ్యతని పేర్కొన్నారు. అర్గానిక్ సర్టిఫికేషన్, ఎక్స్ పోర్ట్ ప్రమోషన్, మార్కెటింగ్ ప్రమోషన్, డొమెస్టిక్ రైల్ కనెక్టివిటి, రోడ్ కనెక్టివిటి జిల్లాకు తీసుకు రావడం జరుగుతుందన్నారు.