నాలుగు దశాబ్దాల కల నెరవేరే తరుణం ఆసన్నమైంది
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ నిజామాబాద్, బతుకమ్మ : నాలుగు దశాబ్దాలుగా రైతులు ఎదురు చూస్తున్న పసుపుబోర్డు కోరిక నెరవేరే తరుణం ఆసన్నమైందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి ఆదివారం జిల్లాకు రానున్న సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభ ఏర్పాట్లను ఆయన శనివారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ జిల్లాకు పసుపు బోర్డు కేంద్రీయ కార్యాలయం కేటాయించిన విషయం తెలిసిందేనని అన్నారు. ఈ పసుపు బోర్డు కేంద్రీయ కార్యాలయాన్ని...