నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : పోగొట్టుకున్న రూ.25 వేల విలువ గల బంగారాన్ని బాధితునికి మంగళవారం అందజేసినట్లు ట్రాఫిక్ సీఐ ప్రసాద్ తెలిపారు. సోమవారం సాయంత్రం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కి డ్రంకెన్ డ్రైవ్ వెహికల్ షూరిటీ కొరకు జనార్ధన్ వ్యక్తి వచ్చాడని తెలిపారు. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ముందు తన వద్ద ఉన్నరూ.25వేల విలువ చేసే 3 గ్రాముల బంగారాన్ని పోగొట్టుకున్నాడని పేర్కొన్నారు. ఆ బంగారం ట్రాఫిక్ కానిస్టేబుల్ ఎండీ. ఫైజుద్దీన్ కి దొరికిందని తెలిపారు. దొరికిన బంగారాన్ని బాధితునికి అందజేశామని తెలిపారు. ఈ సందర్భంగా కానిస్టేబుల్ ఫైజుద్దీన్ ని సీఐ ప్రసాద్ అభింనందిచారు.
