26.2 C
Hyderabad
Monday, August 3, 2026

సర్వే నంబర్ 532 భూముల సమస్యను పరిష్కరించాలి

Must read

📰 Generate e-Paper Clip

  • హైకోర్టు ఆర్డర్ ఉన్న  భూముల సమస్య పరిష్కరించని రెవెన్యూ అటవీ అధికారులు
  • సీపీఐ(ఎం-ఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) జిల్లా నాయకులు ఆర్. రమేష్

 

సిరికొండ, బతుకమ్మ :  సిరికొండ మండల కేంద్రం లోని 532 సర్వే నంబర్ భూముల సమస్యను వెంటనే పరిష్కరించాలని, లేకుంటే ప్రజా ఆగ్రహం తప్పదని,సీపీఐ(ఎం-ఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) జిల్లా నాయకులు ఆర్.రమేష్ అన్నారు.  శుక్రవారం సిరికొండ మండల కేంద్రంలో లబ్ధిదారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్బంగా మాట్లాడుతూ సిరికొండకు సంబంధించిన 532 సర్వేనెంబర్ లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టాలు ఇచ్చిందన్నారు. పట్టాలు ఇచ్చి 19సంవత్సరాలు అయిన నుండి అటవీశాఖ, రెవిన్యూ శాఖ అధికారులు లబ్ధిదారులను అడ్డుకుంటున్నారని అన్నారు. హైకోర్టు లబ్ధిదారులకు అనుకూలంగా ఆర్డర్ ఇచ్చిన అధికారులు అడ్డుకోవడం సిగ్గుచేటు అన్నారు. భూమి మీదికి పోయినప్పుడల్లా అధికారులు హామీలు ఇవ్వడం, తర్వాత కాలయాపన చేయడం తప్ప పరిష్కారానికి పూనుకోవడం లేదన్నారు. సహనం నశించిన లబ్ధిదారులు ఇక భూములను చదును చేసే పనులు పెద్ద ఎత్తున చేపడతారని,ఎవరు అడ్డుకున్నా ఈసారి ఆగేది లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా భూ సమస్యల పరిష్కారం కోసం భూభారతి తెచ్చింది కానీ సమస్యల పరిష్కారంలో తాత్సారాం చేస్తుందన్నారు. సిరికొండకు సంబంధించిన ప్లాట్లు కూడా పరిష్కరించడంలో రెవెన్యూ అధికారులు పూర్తిగా విఫలమయ్యారు అన్నారు. అధికారులు ఇలా ఉంటే ప్రజా ప్రతినిధులు కూడా పూర్తిగా నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుందన్నారు. సిరికొండ 532, ప్లాట్ల విషయం లో  పోరాటడం తప్ప మరో మార్గం లేదన్నారు. కార్యక్రమంలో సిపిఐ (ఎంఎల్)  మాస్ లైన్ ఆర్మూర్ డివిజన్ నాయకులు ఆర్ దామోదర్, జి సాయి రెడ్డి,  మండల నాయకులు  ఈ రమేష్, బి కిషోర్, ఎం. పండరి, ఎం. అశోక్, బి.తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article