26.2 C
Hyderabad
Monday, August 3, 2026

రైతులను రాజులను చేయడమే ప్రభుత్వ లక్ష్యం

Must read

📰 Generate e-Paper Clip

  • ఆనాడు ముఖ్యమంత్రి వరి వేసుకుంటే ఉరి అన్నాడు
  • నేడు వరి వేసుకోండి బోనస్ ఇస్తాం.
  • కోటి మహిళలు కోటీశ్వరుడు చేయడమే లక్ష్యం
  • రైతు నేస్తంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

 

హైదరాబాద్, బతుకమ్మ : రైతులను రాజులు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. సచివాలయం రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద జరిగిన రైతు నేస్తం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రేవంత్ రెడ్డి, తమ ప్రభుత్వం 18 నెలల్లో తెలంగాణ రాష్ట్రంలో ఏ అభివృద్ధి పనులు చేశాయో, రైతులకు ఏ విధంగా అండగా నిలిచిందో క్రుప్తంగా వివరించారు. గత గులాబీ ప్రభుత్వంలో రైతులందు మోసం చేసిందని, ఒక్క ప్రాజెక్టు నిర్మాణం చేయకుండా కోట్లు దండుకొని, కెసిఆర్, కేటీఆర్, హరీష్ రావు కోట్లు సంపాదించుకున్నారని రేవంత్ రెడ్డి తీవ్రంగా ఆరోపించారు. రైతులకు ఏమి చేశారని భరోసా నేతలు రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. బనక చెర్ల ప్రాజెక్టుపై చర్చకు సిద్ధమా అంటూ కెసిఆర్ కు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు . పదేళ్ల కాలంలో చెయ్యని పనిని, 18 నెలల్లో పూర్తి చేశామని సీఎం రేవంత్ రెడ్డి గర్వంగా వెల్లడించారు. ఇదంతా రైతులు, తెలంగాణ ప్రజలు ఇచ్చిన శక్తితోనే తాన ఇది సాధించానని రాష్ట్ర ముఖ్యమంత్రి వెల్లడించారు . రాష్ట్ర ప్రజలు, మరొకవైపు అన్నదాతలు, ఇంకొక వైపు మహిళలు, మరొకవైపు యువత, ఇంకొక వైపు సహచర మంత్రులు సహకారంతో తెలంగాణ రాష్ట్రంలో 18 నెలల్లో రైతులను రాజులుగా చేశామని రేవంత్ రెడ్డి వెల్లడించారు . అన్నదాతలకు అవసరమైనప్పుడు రైతు భరోసా విజయవంతంగా పూర్తి చేశామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. గతంలో ఎన్నడు విధంగా 9 రోజుల్లో రూ, 9 కోట్ల రూపాయలు రైతు భరోసా కింద రైతుల ఖాతాలో వేశమని ఇది తమ ప్రభుత్వం గొప్పతనమని రేవంత్ రెడ్డి వెల్లడించారు . 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో తొమ్మిది రోజుల్లో రూ 9 వేల కోట్లు వేశామంటూ సీఎం రేవంత్ రెడ్డి సభ వేదికగా వెల్లడించారు. రైతు భరోసా కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా రైతులు పండుగ నిర్వహించుకుంటున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు . రైతుల ఆశీర్వాదం వల్లనే తాను చిన్న వయసులోనే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యానని ఇదంతా తెలంగాణ రాష్ట్ర ప్రజలు పెట్టిన బిక్ష అని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు . తనకు తెలంగాణ ప్రజలు ఇచ్చిన పదవితో ప్రజలకు, రైతులకు అండగా ఉంటానని వెల్లడించారు. భూమి కేంద్రంగా సాగిన జీవితం,,, తెలంగాణ రైతన్న జీవితం అంటూ సీఎం వ్యాఖ్యానించారు . వ్యవసాయాన్ని దండగ అనే స్థాయి నుంచి పండుగ చేసేందుకు వైయస్ ఆనాడే ఉచిత విద్యుత్తు అందించారని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ప్రజా ప్రభుత్వంలో మొదటి ప్రాధాన్యత రైతులే, రైతుల తర్వాత మహిళలు యువత మా ప్రాధాన్యం అంటూ సీఎం వ్యాఖ్యానించారు. రైతులకు రుణమాఫీ చేస్తామని ఎన్నికల్లో మాట ఇచ్చాం, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం అంటూ గర్వంగా రేవంత్ రెడ్డి వెల్లడించారు . గత ముఖ్యమంత్రి వరి వేసుకుంటే ఉరి వేసుకోవడమే అని చెప్పారు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సంఘ వడ్లు పండిస్తే బోనస్ ఇస్తామని చెప్పాం,, చెప్పిన విధంగా నలభై ఎనిమిది గంటల్లో రైతులు ఖాతాలో బోనస్ జమ చేశామంటూ రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా రైతులకు గుర్తు చేశారు. దేశంలో అత్యధికంగా వారి పండించిన రాష్ట్రమని గర్వంగా చెప్పుకుంటున్నామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. కెసిఆర్ రూ,8 కోట్లకు పైగా అప్పులు తమ నెత్తి మీద పెట్టి వెళ్లారని సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. లక్ష కోట్ల రూపాయలతో కాలేశ్వరం కట్టడం కూలడం కూడా జరిగిపోయిందని ఇది కెసిఆర్ పనితీరుకు నిదర్శనం అంటూ సీఎం తీవ్రంగా విమర్శించారు.

The government's goal is to make farmers kings.

కెసిఆర్, కేటీఆర్, హరీష్ రావు కు ఫామ్ హౌస్ లు ఎలా వచ్చాయి? అంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రాన్ని దివాలా తీస్తే కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ఎట్లా సంపన్నులయ్యారు? అంటూ రేవంత్ రెడ్డి గులాబీ నేతలపై తీవ్రంగా మండిపడ్డారు . కెసిఆర్ ప్రభుత్వ హయాంలో వేదాద్రి ప్రభుత్వ పాఠశాలలో మూతపడ్డాయి అంటూ రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఒక ఏడాదిలోనే 60000 ఉద్యోగాలు ఇచ్చాం దీనిని నిరూపించడానికి ఎక్కడైనా సిద్ధం అంటూ రేవంత్ రెడ్డి సవాల్ చేశారు . కోటి మంది మహిళలు కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ ధ్యేయం. మహిళ సౌర విద్యుత్ ఉత్పత్తి చేసేలా చర్యలు చేపడుతున్నాం అంటూ రేవంత్ రెడ్డి వెల్లడించారు. వేయి మెగావట్ల సౌర విద్యుత్తు ప విద్యుత్ శాఖ ఒప్పందం కుదిరింది అంటూ సీఎం వెల్లడించారు. మహిళలకు రూ, 21 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చి ఆదుకుంటున్నాం అంటూ సీఎం వెల్లడించారు  . మహిళ స్వయం సహాయక సంఘాలు ఉత్పత్తులు విగ్రహానికి చర్యలు తీసుకుంటున్నాం, శిల్పారామంషా 150 దుకాణాలు ఏర్పాటు చేయడానికి స్థలం కేటాయించినట్లు సీఎం గుర్తు చేశారు. ఎనిమిది వేల ఐకెపి కేంద్రాలకు మహిళల చేతులు పెట్టడం జరిగిందని సీఎం ఈ సందర్భంగా గుర్తు చేశారు. గ్రామాలలో అమ్మ ఆదర్శ పాఠశాలలు తీసుకువచ్చాం, పాఠశాలలో ఆహార పదార్థాలు సరఫరా బాధ్యత స్వయం సంఘాలకు అప్పగించడం జరుగుతుందని ముఖ్యమంత్రి వెల్లడించారు పదేళ్ల బారస పాలన 18 నెలల కాంగ్రెస్ పాలనపై చర్చ పెట్టడానికి సిద్ధమా అంటూ గులాబీ నేతలకు సవాల్ చేశారు కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ప్రాజెక్టులు బారాస పూర్తి చేయలేదు అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించార పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఏడారిగా మార్చారు కల్వకుర్తి ఆగిపోయింది బీమా నెట్టెంపాడు పురోగతి లేదు అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు కోయిల సాగర్ దేవరద సీతారామ ప్రాణహిత చేవెళ్ల ఊసే లేదు అంటూ సీఎం గులాబీ పాలకులపై తీవ్రంగా మండిపడ్డారు ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రివిక్రమార్క్ తుమ్మల నాగేశ్వరరావు శ్రీధర్ బాబు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సీతక్క పాల్గొన్నారు.

The government's goal is to make farmers kings.

More articles

Latest article