24.1 C
Hyderabad
Monday, August 3, 2026

ప్రభుత్వం ఏదైనా దళారులదే హవా

Must read

📰 Generate e-Paper Clip

బోధన్, బతుకమ్మ : బోధన్ మండలం ఖండగవ్ గ్రామం నుండి రాత్రి పగలు తేడా లేకుండా టీప్పర్లలో,ట్రాక్టర్లలో అక్రమంగా మహా రాష్ట్ర,ఇతర ప్రాంతాలకు ఇసుకను తరలిస్తున్నారని గ్రామస్తులు వివరించారు. ప్రతి రోజు రాత్రి పది తరువాత డోజర్లతో ట్రాక్టర్లలో ఇసుకను డంపింగ్ చేసి అక్రమంగా తరలిస్తున్నారని అన్నారు. గురువారం ఖండ్గావ్ గ్రామ ప్రజలు బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో ను కలిసి వినతి పత్రం అందజేశారు. కండ్ గావ్ గ్రామ శివారు, మంజీరా బ్రాడ్జ్, చౌరస్తా వద్ద చెక్ పోస్టులతో పాటు సీసీ కెమెరాల ఏర్పాటు చేసి ఇసుకు అక్రమ రవాణా కు అడ్డుకట్ట వేయాలని గ్రామ ప్రజలు సబ్ కలెక్టర్ కు విన్నవించారు.

More articles

Latest article