27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం విఫలమైంది

Must read

📰 Generate e-Paper Clip

 

. . . రైతు గోస.. బీజేపీ భరోసా యాత్రలో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ధాన్యం కొలుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ తెలిపారు. బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన ” రైతు గోస బీజేపీ భరోసా” కార్యక్రమంలో భాగంగా సోమవారం వికారాబాద్ జిల్లా కులకచర్ల మార్కెట్ కమిటీ, గజ్వేల్ ధాన్యం కేంద్రాలను రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు, ఎంపీలు, సహచర ఎమ్మెల్యేలతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…45 రోజులు దాటినా గన్నీ బస్తాలు ఇవ్వకుండా , కాంటా పెట్టకుండా, కొన్ని చోట్ల తూకం వేసినా బస్తాలను తరలించేందుకు లారీలు లేకపోవడంతో తీవ్రమైన ఇబ్బందులు ఎదురుకుంటున్నారన్నారు.  గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరంగల్‌ సభలో  రాహూల్‌ గాంధీ రైతు డిక్లరేషన్‌ పేర అనేక హామీలు ఇచ్చి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. డిక్లరేషన్‌ పేరుతో హామీలిచ్చి అమ లు చేయని రైతు ద్రోహి సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. దేశానికి అన్నంపెట్టే రైతును కాంగ్రెస్‌ పార్టీ నిలువునా మోసం చేస్తుందని ఆరోపించారు. మొక్కజొన్న పండించిన రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందనీ చెప్పారు. రైతుల కష్టాలను పరిష్కరించాల్సిన ప్రభుత్వ పెద్దలు ఏసీ గదులకు పరిమితం అయ్యారని ఆరోపించారన్నారు.

 

The government has failed to purchase grain.

More articles

Latest article