వెబ్ న్యూస్, బతుకమ్మ : తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, శ్రీశైలం, వేములవాడ, బాసర, భద్రకాళి, ఏడుపాయల దేవాలయాల్లో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. విజయవాడలో నాలుగో రోజు దుర్గమ్మ కాత్యాయని దేవి, వరంగల్ లో భద్రకాళి మాత మహాలక్ష్మిగా భక్తులకు దర్శనం ఇచ్చారు. ఈసందర్భంగా భక్తులతో ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. ప్రత్యేక పూజలు చేస్తున్నారు.


