29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

అక్షరం నేర్పిన మాన్యుడు

Must read

📰 Generate e-Paper Clip

  • బీఎస్పి జిల్లా అధ్యక్షుడు మాలోత్ హరిలాల్ నాయక్

 

కామారెడ్డి సిటీ, బతుకమ్మ: అక్షరం నేర్పిన మహనీయుడు మహాత్మ జ్యోతిరావు పూలే అని కామారెడ్డి జిల్లా బీఎస్పీ అధ్యక్షుడు హరిలాల్ నాయక్ శుక్రవారం ఘనంగా నివాళులు అర్పించి వారు మాట్లాడుతూ… మహాత్మ జ్యోతిరావు పూలే దంపతులు మనకు చదువు నేర్పకపోయి ఉండి ఉంటే ప్రస్తుతం మనం ఎక్కడ ఉండేవాళ్లుం? నేటికీ గోచీలు కట్టుకుని కూలీలుగా జీవించేవాళ్ళం.. ఉన్నత విద్యావంతులుగా మారేవాళ్లమా? ఆత్మగౌరవంగా ఉన్నతంగా బతికే వాళ్ళమా? ప్రజా ప్రతినిధులుగా ఎదిగే వాళ్ళమా? బ్రహ్మనాధిపత్యం అసమానతలు తీవ్రంగా ఉన్న రోజుల్లోనే మహాత్మ జ్యోతిరావు పూలే మనందరినీ అక్షరాస్యులుగా మార్చి సమానత్వాన్ని సాధించాలని ప్రయత్నించారు.

The gentleman who taught the alphabet

అయినప్పటికీ ఆధిపత్యా వర్గాల దాడులు ఎదుర్కుంటూ పూలే దంపతులు మహాత్మ జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే మనకు చదువు నేర్పించారు. ఆ చదువు నేర్పించకపోతే మనకు గోడ్డు గోదాల కన్న హీనంగా బతికే వాళ్ళం అని అన్నారు. అనంతరం కామారెడ్డి జిల్లా బహుజన్ సమాజ్ పార్టీ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. బీఎస్పీ పార్టీ బలోపేతానికి దిశ నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కొక్కొండ రాజేందర్, కోశాధికారి సిద్ధిరాములు, కామారెడ్డి జిల్లా అసెంబ్లీ అధ్యక్షుడు ఇసిరికాయల సాయిలు, జుక్కల్ అసెంబ్లీ అధ్యక్షుడు ఇబ్బత్వార్ రోహిత్ దాస్, ఎల్లారెడ్డి అధ్యక్షుడు సాయిబాబా, నత్తి జీవన్, రాశి గోల బాబు, ప్రభాకర్ దాస్, బాల మల్లు, రవి, తదితరులు పాల్గొన్నారు.

The gentleman who taught the alphabet

More articles

Latest article