29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

రెప రెపలాడిన మువ్వన్నెల జెండాలు

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ: రుద్రూర్ మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ తారబాయి, ఎంపీడిఓ కార్యాలయం వద్ద ఎంపీడిఓ భీమ్ రావు, పోలీస్ స్టేషన్ లో ఎస్సై సాయన్న, గ్రామ పంచాయతీ కార్యాలయం సెక్రెటరీ ప్రేమ్ దాస్, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద సొసైటీ చైర్మన్ సంజీవ్ రెడ్డి, అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, గ్రంథాలయం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద జాతీయ జెండాలు ఎగురవేస్తూ 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. స్వాతంత్రం కోసం ప్రాణాలు త్యాగం చేసిన పితామహులను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article