28.2 C
Hyderabad

కేసీఆర్ కు రాజకీయభిక్ష పెట్టిన కుటుంబం నాది

Must read

📰 Generate e-Paper Clip

. ఎంపీ ధర్మపురి అర్వింద్
నిజామాబాద్, బతుకమ్మ: కేసీఆర్ కు రాజకీయ భిక్ష పెట్టిన కుటుంబం తనదని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. తెలంగాణ వచ్చేది లేదు అంటూ కేటీఆర్ అమెరికాలో కూర్చుని మాట్లాడారని ఆయన విమర్శించారు. నిజామాబాద్ ఆయన విలేకరులతో మాట్లాడారు. కేటీఆర్ చెల్లె కవిత లిక్కర్ స్కామ్ లో సంచులు మోశారని, రేవంత్ రెడ్డి సైతం సంచులు మోసి వచ్చారని అన్నారు. వాళ్లు సంచులు మోసే వాళ్లైతే మేము జాతీయ వాదం మోసేటోళ్లమని అన్నారు. ప్రభుత్వం పోయినా బీఆర్ఎస్ వాళ్లకు బుద్ధి రావడం లేదన్నారు. ఎన్నికల్లో నిల్చునే ముఖం వారిది కాదన్నారు. పవన్ కళ్యాణ్ కు రాజకీయాల్లోకి రాక ముందే ఎంతో ఫేమ్ ఉందని, ఆయన సంపాదనను కాదనుకుని రాజకీయాల్లోకి వచ్చారన్నారు.

More articles

Latest article