30.9 C
Hyderabad
Monday, August 3, 2026

పోలిసుల తీరును నిరశిస్తు న్యాయవాదుల ఆందోళన

Must read

📰 Generate e-Paper Clip

The disinterested advocates are concerned about the behavior of the policeబతుకమ్మ, నిజామాబాద్ క్రైం

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాదులపై పోలీసుల భౌతిక దాడులు పెరిగిపోవడం పట్ల నిరసనగా తెలంగాన రాష్ట్ర ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్స్ పిలుపుమేరకు న్యాయవాదులు కోర్టు ఎదుట నిరసన తెలిపారు. సోమవారం నిజామాబాద్ బార్ అసోసియేషన్ బార్ అధ్యక్షుడు జగన్ మోహన్ గౌడ్ అధ్యక్షతన జిల్లాకోర్టు ప్రాంగణంలోని బార్ సమావేశపు హల్ లో నిర్వహించిన అత్యవసర సమావేశం ఆనంతరం విధులను బహిష్కరించారు. ఈ సందర్బంగా బార్ అధ్యక్షుడు జగన్మోహన్ మాట్లాడుతు..పోలీసుల దుశ్చర్యల మూలంగా పోలీసు వ్యవస్థ అపఖ్యాతి పాలవుతోందని తెలినట్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కూకట్ పల్లి బార్ అసోసియేషన్ సభ్యుడు సంతోష్ ను అకారణంగా తెల్లవారుజామున ఇంటినుండి తీసుకువెళ్లిన తీరు సభ్యసమాజానికి తలవంపులు తెచ్చిందని అన్నారు.చట్ట ప్రకారం విధులు నిర్వహించాల్సి పోలీసులు చట్టవ్యతిరేకమైన చర్యలకు పాల్పడడం క్షమించరాని క్రిమినల్ చర్యలని పేర్కొన్నారు. బోరుబండ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ జమాల్ ను ఉద్యోగం నుండి తక్షణం సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. న్యాయవాదులపై పోలీసు దాడులపై సమగ్ర న్యాయవిచారణ జరిపించాలని జగన్ అన్నారు. న్యాయవాదుల రక్షణ చట్టం త్వరితగతిన రూపొందించి అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు ఎం రాజేందర్ రెడ్డి బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వసంత్ రావు,కోశాధికారి దీపక్,లైబ్రరీ కార్యదర్శి పిల్లి శ్రీకాంత్, న్యాయవాదులు మానిక్ రాజు,రవీందర్,భిక్షపతి, బిట్ల రవి,ఆశ నారాయణ, విశ్వక్ సేన్ రాజ్,భానుచందర్,గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు

More articles

Latest article