. . . టీజీఈజేఏసీ రాష్ట్ర అడిషనల్ సెక్రటరీ జనరల్ పులగం దామోదర్ రెడ్డి
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
సెప్టెంబర్ 2004 తర్వాత నియమించబడిన ఉద్యోగులందరికీ సీపీఎస్ స్కీం నుండి రద్దుచేసి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని టీజీఈజేఏసీ రాష్ట్ర అడిషనల్ సెక్రటరీ జనరల్ పులగం దామోదర్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యోగ, గెజిటెడ్ అధికారుల, ఉపాధ్యాయుల, కార్మిక & పెన్షనర్ల ఐక్య కార్యాచరణ కమిటీ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు, శుక్రవారం టీజీఈజేఏసీ జిల్లా చైర్మన్, టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్ అధ్యక్షతన నిరసన కార్యక్రమం నిర్వహించారు. నిజామాబాద్ ఐడిఓసి కార్యాలయ ఆవరణలో నల్ల బ్యాడ్జీలు ధరించి చేపట్టిన నిరసన కార్యక్రమానికి పులగం దామోదర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో పలుమార్లు 69 పైగా డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వానికి వినతి పత్రాలు అందజేసినప్పటికి, ఏర్పాటైన రాష్ట్ర ప్రభుత్వం, ఉద్యోగుల సమస్యలను పెడచెవిన పెట్టిందన్నారు. 69 డిమాండ్లను పరిష్కరించాలని, నేడు నిరసన ప్రదర్శనను చేపట్టామని ఉద్యమ కార్యచరణలో భాగంగా మే 5 న సామూహిక నిరాహార దీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. అయినను రాష్ట్ర ప్రభుత్వం, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకపోతే, రాష్ట్ర నాయకత్వం పిలుపుమేరకు తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు. టీజీఈజేఏసీ రాష్ట్ర బాధ్యులు దామోదర్ రెడ్డి తెలిపినట్టు ముఖ్యమైన నాలుగు డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేని యెడల రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఉద్యమ కార్యచరణను నిర్వహించుటకు సిద్ధంగా ఉన్నామని, దీనికి గాను ఉద్యోగులందరూ సమాయత్తం కావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీజీఈజేఏసీ జిల్లా కోకన్వీనర్ మోహన్ రెడ్డి, కో చైర్మన్ లు రమేష్, రమన్ రెడ్డి, ధర్మేందర్, శ్రీనివాస్, కృష్ణారెడ్డి, సురేష్, పండరినాథ్, వైస్ చైర్మన్లు విజయ్ సింగ్, శేఖర్ ,అమృత్ కుమార్, ప్రశాంత్, మోహన్, ఫైనాన్స్ సెక్రటరీ జాకీర్ హుస్సేన్, టీజీఈజేఏసీ జిల్లా కార్యవర్గ సభ్యులు, అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు, అంగన్ వాడీ ఉద్యోగులు, మహిళా ఉద్యోగ సోదరీమణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
