26.2 C
Hyderabad
Monday, August 3, 2026

గో ఆరాధన ఉద్యమానికి ప్రతి ఒక్క హిందువు మద్దతు అవసరం

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఈ నెల 27న తహసీల్దార్ కార్యాలయాల్లో వినతుల అందజేత

 

. . . అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

జాతీయస్థాయిలో చేపట్టిన గో ఆరాధన ఉద్యమానికి ప్రతి ఒక్క హిందువు మద్దతు ఎంతో అవసరమని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. అఖిల భారత గో సమ్మాన్ అభియాన్ ఆధ్వర్యంలో గురువారం ఎమ్మెల్యే కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భారతీయ సంస్కృతి రాజ్యాంగానుసారంగా అహింసా మార్గంలో గో సంరక్షణ కొరకు ఆరాధన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారన్నారు. ప్రధానంగా దేశంలో సంపూర్ణ గోహత్య నివారణ చేయడం, గోవును దేశమాతగా ఆరాధ్యనీయ దేశదేవతగా గుర్తించాలన్నారు. అలాగే గో పరిరక్షణ చట్టం, బోర్డును తీసుకురావాలని అన్నారు. వీటిని సాధించేందుకు ఈ నెల 27న జిల్లాలోని అన్ని తహశీల్దార్ కార్యాలయాల్లో వినతి పత్రాలు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గో సమ్మాన్ అభియాన్ ప్రతినిధులు అనిల్ గోపాల్, కుషాల్ దాస్, భూపాల్ సింగ్, వీహెచ్ పీ గో రక్ష విభాగం తెలంగాణ ప్రాంత కృషి ప్రముఖ్ ధాత్రిక రమేష్, ఇందూరు గో సేవా సమితి అధ్యక్షుడు వీరమల్లి రమేష్, లక్ష్మీ కాంతం, యాదగిరి, రజినీకాంత్, వెంకటరమణ, పవన్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article