పొలంలోకి దూసుకెళ్లిన కారు
బతుకమ్మ, నాగిరెడ్డిపేట్ : మండల కేంద్రం సమీపంలోని వాగులమోరీ బ్రిడ్జి సమీపంలో ఎక్సెల్ వాహనంపై ప్రయాణిస్తున్న వ్యక్తిని తప్పించబోయి కారు పొలంలోకి దూసుకెళ్లింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మహారాష్ట్రకు చెందిన సునీల్ అనే వ్యక్తి బోధన్ నుండి హైదరాబాద్ కు తన బొలెరో వాహనంలో వెళ్తుండగా ఉదయం 9 గంటల సమయంలో నాగిరెడ్డిపేట మండల కేంద్రం సమీపంలోని బోధన్ హైదరాబాద్ ప్రధాన రహదారిపై వాగుల మోరి బ్రిడ్జి వద్ద ఎక్సెల్ వాహనంపై ప్రయాణిస్తున్న వ్యక్తిని తప్పించబోయి కారుకు బ్రేకులు ఫెయిల్ కావడంతో కారు...