25.5 C
Hyderabad

కమనీయం.. రమణీయం సీతారామ కళ్యాణ

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : నర్సింగ్ పల్లి ఇందూరు తిరుమల క్షేత్రంలో అత్యంత వైభవంగ శ్రీరామ నవమి వేడుకలు నిర్వహించారు. సీతారాముల  కళ్యాణోత్సవాన్ని కన్నుల పండుగగ నిర్వహించిన అర్చక స్వాములు రోహిత్ కుమారాచార్య, శ్రీధర్ స్వామి. ఆలయ ధర్మకర్త నర్సింహ రెడ్డి దంపతులు, విజయసింహారెడ్డి దంపతులు దంపతులు పాల్గొని కన్యాదాన ఫలసిద్ది చేసి ప్రజలందరికి ఆ కన్యాదాన భాగ్యాన్ని అందజేశారు. “ర” అంటే కష్టం “మ అంటే హరణం ఈ కలియుగంలో కష్టాలు తొలిగి సుఖాలు పొందడానికి “రామ” మంత్రమే తారక మంత్రం అని రోహిత్ స్వామి తెలియజేసారు. ఆలయ ఆస్థాన గాయకులు సాత్విక, నందిని లు తమ గానామృతంతో స్వామివారి కీర్తనలను అద్భుతంగ పాడి రక్తి కట్టించారు. ఈ కార్యక్రమంలో నర్సింహారెడ్డి దంపతులు, విజయసింహ రెడ్డి దంపతులు, ఎంపీటీసీ రాములు, నర్సారెడ్డి, నరాల సుధాకర్, ప్రసాద్, రమేష్, రాజేశ్వర్, మురళి, సురేష్, భూం రెడ్డి, చిన్నయ్య, సాయిలు. వేద పండితులు రోహిత్ కుమారాచార్యులు మరియు శ్రీధర్ స్వామి, విజయ్ స్వామి తదితరులు పాల్గొన్నారు.

The beautiful... beautiful wedding of Sitarama

More articles

Latest article