24.7 C
Hyderabad
Monday, August 3, 2026

తెయూలో ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు

Must read

📰 Generate e-Paper Clip

  • ఆగస్టు 5న మూడవ కౌన్సిలింగ్ ద్వారా 240  కంప్యూటర్ కోర్సులో  ప్రవేశానికి అనుమతి
  •  వైస్ ఛాన్స్ లర్  ప్రొఫెసర్ టి.యాదగిరి రావు 

 

డిచ్ పల్లి, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవోనెంబర్ 32 ద్వారా  తెలంగాణ విశ్వవిద్యాలయానికి ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేసిcనందుకు తెలంగాణ రాష్ట్రముఖ్యమంత్రి కి  తెలంగాణ యూనివర్సిటీ వైస్ఛాన్సలర్  ప్రొఫెసర్ టి.యాదగిరిరావు, రిజిస్ట్రార్  ప్రో.ఎం.యాదగిరి  లు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈసందర్భంగా వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టి యాదగిరిరావు మాట్లాడుతూ  తెలంగాణ విశ్వవిద్యాలయంలో  ఆగస్టు 5న ప్రారంభమయ్యే  మూడవ కౌన్సిలింగ్ ద్వారా  ఇంజనీరింగ్ కళాశాలలో 240  కంప్యూటర్ కి సంబంధించిన కోర్సులలో  ప్రవేశానికి అనుమతి లభించింది అని ఈ కోర్సు ల నుపటిష్టంగా నిర్వహిస్తామన్నారు.ఈ విద్యా సంవత్సరం నుండి  ఇంజనీరింగ్ లో జాయిన్ అయినా  విద్యార్థిని విద్యార్థులకు   ఎలాంటి లోటు ఏర్పడకుండా  చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.   ప్రతిష్టాత్మకమైన ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుకువిశిష్ట కృషి చేసిన ఈ ప్రాంత శాసన మండలి సభ్యులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ,ప్రభుత్వ సలహాదారు షబ్బీర్,జిల్లా శాసనసభ్యులు  ఏ భూపతిరెడ్డి, సుదర్శన్ రెడ్డి, మదనమోహన్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి లకు ప్రాంత ప్రజాప్రతినిధులందరికీ  ధన్యవాదాలు తెలియజేశారు.ఈఇంజనీరింగ్ కళాశాల మంజూరు  సాంకేతికంగా  సహకరించిన తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్,ప్రొఫెసర్ వి బాలకృష్ణారెడ్డి, కార్యదర్శిప్రొఫెసర్  శ్రీరామ్ వెంకటేష్, ప్రొఫెసర్ ఇటిక్యాల పురుషోత్తం,  ప్రధానంగా ఉన్నత విద్యా మండలి కార్యదర్శి  డాక్టర్ యోగితారాణా,కాలేజెట్కమిషనర్ దేవసేన కృషిని ఈ సందర్భంగా ప్రశంసించారు.  ఈ ఇంజనీరింగ్ కళాశాల మంజూరు కు మద్దతుతెలియజేసిన   ఈ ప్రాంత విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు,తెలంగాణ విశ్వవిద్యాలయం టీచర్స్ అసోసియేషన్ కు, నాన్ టీచింగ్ సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు.  ఈ పత్రికా సమావేశంలో  ఆడిట్ సెల్ డైరెక్టర్, ప్రొఫెసర్ గంటాచంద్రశేఖర్, కంట్రోలర్, కే సంపత్కుమార్, ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త  ప్రొఫెసర్ కె రవీందర్ రెడ్డి, ప్రొఫెసర్ కనకయ్య, ప్రొఫెసర్ రాంబాబు, ప్రొఫెసర్ ఆంజనేయులు, డైరెక్టర్ పి ఆర్ ఓ  డాక్టర్ జై పున్నయ్య, డైరెక్టర్మైనార్టీ సెల్, డాక్టర్ మహమ్మద్ అబ్దుల్ కవి  తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article