నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : టీజీఈ జేఏసీ ఆధ్వర్యంలో మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి మంగళవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా టీజీఈ జేఏసీ చైర్మన్ నాశెట్టి సుమన్ కుమార్ మాట్లాడారు. టీజీఈ జేఏసీ కేంద్ర నాయకత్వ ఉద్యమ కార్యచరణలో ప్రజా ప్రతినిధులకు వినతి పత్రాల సమర్పణ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి 57 అంశాలతో కూడిన వినతి పత్రాన్ని అందజేసినట్లు తెలిపారు. ఉద్యోగుల సమస్యలపై చర్చించామన్నారు. ఉద్యోగుల న్యాయపరమైన డిమాండ్లు ప్రభుత్వంతో చర్చించి పరిష్కారానికి కృషి చేయాలని కోరినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ అలుక కిషన్, కో చైర్మన్లు రమేష్, ఎల్.రమన్ రెడ్డి, నేరేళ్ల శ్రీనివాస్, లాటికర్ రాము, వైస్ చైర్మన్లు నేతికుంట శేఖర్, కృపాల్ సింగ్, ఫైనాన్స్ సెక్రటరీ జాకీర్ హుస్సేన్, ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.
